: శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయండి... గవర్నర్ కు టీ కాంగ్రెస్ వినతి
గవర్నర్ నరసింహన్ ను టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, డీఎస్, పలువురు ఎమ్మెల్సీలు కలిశారు. జులై 2న జరగనున్న తెలంగాణ శాసనమండలి ఎన్నికను వాయిదా వేయాలని ఈ మేరకు గవర్నర్ ను కోరారు. బీఏసీ సమావేశం నిర్వహించకుండా మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించకూడదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.