: కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఎర్రబెల్లి ఓపెన్ ఆఫర్
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లోని ఏదో ఒక జడ్పీ ఛైర్మన్ పదవిని తమకు వదిలేయాలని, అలా చేస్తే మిగిలిన జిల్లా పరిషత్ స్థానాల్లో తమకు మద్దతిచ్చిన పార్టీకి మద్దతిస్తామని ఆయన ప్రకటించారు.