: టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి లేఖ
మూడు రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. ఈ మేరకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ పదవి తనకు ఇస్తామని తొలుత నుంచీ హామీ ఇవ్వడం వల్లే తాను జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి గెలిచానన్నారు. కానీ, ప్రస్తుతం తనను కాకుండా మరో అభ్యర్థికి అక్కడి జడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారని, ఇది సరికాదని వివరించారు. దీనిపై వెంటనే కల్పించుకుని తనకు న్యాయం చేయాలని యాదవ్ రెడ్డి కోరారు.