: మేకప్ లేకుండా అమితాబ్


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మేకప్ లేకుండా టీవీ షోలో దర్శనమివ్వనున్నారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ 'యుధ్' అనే టీవీ షోలో యుధిష్ఠిర్ సికర్వార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కనిపించనున్నారు. అమితాబ్ ను కొత్తగా చూపించాలని భావించిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, మేకప్ లేకుండా నటిస్తే బాగుంటుందని అమితాబ్ కు ప్రతిపాదించారు. ప్రయోగాలంటే ముందుండే అమితాబ్ దర్శకుడి ప్రతిపాదనకు సమ్మతించారు. దీంతో ఈ టీవీ షోలో ఆయన మేకప్ లేకుండా కన్పించనున్నారు.

  • Loading...

More Telugu News