: నంది ప్రదానోత్సవంలో అమితాబ్


ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో నంది పురస్కారాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డులను అందించనున్నారు. ఇటీవలే సర్కారు ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు అమితాబ్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా, నంది అవార్డుల కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నాగార్జున, మహేశ్ బాబు, రాజశేఖర్, ఆదిశేషగిరిరావు తదితరులున్నారు.

  • Loading...

More Telugu News