: చంద్రబాబును తిట్టి పబ్బం గడుపుకుంటున్నాడు: ఎర్రబెల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తిట్టి పబ్బం గడుపుకుంటున్నాడని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రగల్భాలు, ఉపన్యాసాలు తప్ప ఒక్క పరిశ్రమైనా కేసీఆర్ తెచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రంతో తగువుపెట్టుకోవాలని చూసే పనులు మానాలని ఆయన కేసీఆర్ కు హితవు పలికారు.
తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ ప్రజలేనని, వారందర్నీ కాపాడే ప్రయత్నం చేయాలని ఆయన కేసీఆర్ కు సూచించారు. లేని పక్షంలో మరో ఉద్యమం ఊపిరిపోసుకుంటుందని ఆయన హెచ్చరించారు. జగన్ చెప్పినందువల్లే టీవీ9, ఏబీఎన్ లపై కేసీఆర్ కక్ష సాధింపు చేపట్టారని ఆయన మండిపడ్డారు. తన అవినీతిని బయటపెట్టినందువల్లే వీటిని ఆపాలని కేసీఆర్ ను జగన్ కోరారని ఆయన ఆరోపించారు.