: నల్లకుబేరుల జాబితా ఇవ్వండి: స్విస్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ
స్విస్ బ్యాంకుల్లో డబ్బు పోగేసుకున్న భారతీయుల వివరాలు తెలపాలంటూ కేంద్రం తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. తాము భారత్ కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవలే స్విట్జర్లాండ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజా లేఖ రాసింది. నల్ల కుబేరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధంగా ఉన్నారని భారత్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యర్థన లేఖ పంపిందని ఆయన పేర్కొన్నారు.