: సార్క్ దేశాలకు ఓ ఉపగ్రహాన్ని కానుకగా ఇద్దాం: మోడీ
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. తొలి శాటిలైట్ ఆర్యభట్టను బెంగళూరులోని పారిశ్రామిక షెడ్డుల్లో తయారు చేశారని... ఇప్పుడు అత్యున్నత టెక్నాలజీతో, అగ్ర రాజ్యాలకు దీటుగా ఉపగ్రహాలను తయారు చేస్తున్నామని, విజయవంతంగా ప్రయోగిస్తున్నామని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. శాస్త్రవేత్తల కృషిని వృథాగా పోనీయమని... ఫలితాలను ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో భారీ సంఖ్యలో యువతను స్పేస్ టెక్నాలజీ రంగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సార్క్ దేశాలకు ఒక ఉపగ్రహాన్ని తయారు చేసి కానుకగా ఇద్దామని... ఆ ఉపగ్రహం సార్క్ దేశాలకు ప్రయోజనకారిగా ఉంటుందని చెప్పారు.