: షార్ లో ప్రధాని ఏంచేశారంటే...!


రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రమే శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, ఇతర అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. షార్ లోని భాస్కర గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం, రాకెట్ ప్రయోగకేంద్రం విశేషాలను తెలుసుకునేందుకు మోడీ ఆసక్తి కనబరిచారు.

పీఎస్ఎల్వీ-సి23 శక్తిసామర్థ్యాలను, ఆ వాహకనౌక మోసుకెళ్ళే ఉపగ్రహాల వివరాలను షార్ డైరక్టర్ ఎంవైఎన్ ప్రసాద్, శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. అనంతరం, ఇస్రో భవిష్యత్ కార్యాచరణను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, జీఎస్ఎల్వీ-మార్క్3 ప్రాజెక్టు పనులు జరుగుతున్న సాలిడ్ స్టేజ్ అసెంబ్లింగ్ భవనానికి వెళ్ళారు.

అక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ దశలను శ్రద్ధగా పరిశీలించారు. ఈ సమయంలో ప్రధాని వెంట గవర్నర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఇస్రోకు చెందిన అన్ని విభాగాల డైరక్టర్లు, సీనియర్ సైంటిస్టులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన భాస్కర గెస్ట్ హౌస్ కు చేరుకుని భోజన కార్యక్రమాలు ముగించారు.

  • Loading...

More Telugu News