: ఆ 'మూడు' బ్యాంకులపై చర్యలకు ఆర్ బీఐ రెడీ


నిబంధనలకు తిలోదకాలు వదిలి యధేచ్చగా మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపణలెదుర్కొంటున్న ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకులపై చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. భారత్ లో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులుగా ఖ్యాతి గడించిన ఈ మూడు బ్యాంకుల తీరుతెన్నులపై గత నెలలో 'కోబ్రాపోస్ట్' అనే వెబ్ మ్యాగజైన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ శూలశోధనలో బ్యాంకులు తప్పిదాలకు పాల్పడినట్టు ఆధారాలతో సహా స్పష్టమైంది. దీంతో, రిజర్వ్ బ్యాంకు విచారణ కు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ మాట్లాడుతూ, ప్రాథమిక విచారణ పూర్తయిందని, ఇక చర్యలు తీసుకోవడమే తరువాయి అని చెప్పారు. స్థాయీకృత వ్యవస్థలపైనా, తప్పిదాలకు పాల్పడ్డ వ్యక్తులపైనా చర్యలుంటాయని ఆయన తెలిపారు. ఢిల్లీలో నేడు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News