: అప్పుడే మోడీ నుంచి అద్భుతాలను ఆశించొద్దు: పారికర్
కేంద్రంలో నరేంద్రమోడీ సర్కారు నుంచి ప్రారంభంలోనే అద్భుతాలను ఆశించొద్దని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ''కొందరు నన్ను 'మంచి రోజులు వచ్చాయా?' అని అడుగుతున్నారు. నేను 'రానున్నాయని' చెబుతున్నాను" అంటూ నిన్న సాయంత్రం గోవా రాజధాని పణాజిలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో పారికర్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయని చెప్పారు.