: ఇంగ్లండ్ సిరీస్ లో భారత జట్టుకు ద్రవిడ్ పాఠాలు


భారత జట్టులో సుదీర్ఘకాలం ఆటగాడిగా పనిచేసిన రాహుల్ ద్రవిడ్... ప్రస్తుతం టీమ్ ఇండియాకు మెంటార్ గా సేవలు అందించనున్నాడు. భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ వెళ్లింది. ఈ సిరీస్ జూలై 9 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కు ద్రవిడ్ ను మెంటార్ గా బీసీసీఐ వినియోగించుకోనుంది. ద్రవిడ్ పాఠాలు కుర్రాళ్లకు ఉపకరిస్తాయని కోచ్ డంకన్ ఫ్లెచర్ బీసీసీఐకి సలహా ఇచ్చాడు. రాహుల్ కు ఉన్న అపార అనుభవం జట్టు సభ్యులకు ఉపకరిస్తుందంటూ కోచ్ తమను సంప్రదించారని బీసీసీఐ కార్యదర్వి సంజయ్ పటేల్ మీడియాకు తెలిపారు. తాము రాహుల్ ను సంప్రదించగా, ఆయన తమ అభ్యర్థనను మన్నించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News