: దోచుకున్న డబ్బు నుంచి జగన్ ఇస్తే అందరూ సంతోషిస్తారు: ఎమ్మెల్యే తోట
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మరణాలను కూడా రాజకీయం చేసే దుస్థితికి జగన్ చేరుకున్నారని మండిపడ్డారు. గెయిల్ పైప్ లైన్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిన్న జగన్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే తోట వ్యాఖ్యానిస్తూ... ఇంత పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. తాను దోచుకున్న అవినీతి డబ్బులో నుంచి కోటి రూపాయల చొప్పున ఆయన నష్ట పరిహారం ఇస్తే అందరూ సంతోషిస్తారంటూ ఎద్దేవా చేశారు.