: నాన్నను పోలీసులే కాల్చి చంపారు: తెలంగాణ హోంమంత్రి నాయిని


తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పదేళ్ల వయసులో, నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉన్నప్పుడు తన తండ్రిని పోలీసులే కాల్చి చంపారని ఆయన చెప్పారు. కమ్యూనిస్టులకు ఆయుధాలు చేరవేస్తున్నాడనే నెపంతో తన తండ్రిని హతమార్చినట్లు నాయిని వివరించారు. ఆ సమయంలో గ్రామంలో ఆయుధాలు దాచుకున్న కొందరి ఇళ్లను తాను పోలీసులకు చూపించానని... యాధృచ్చికంగా ఇప్పుడు అదే పోలీసు విభాగానికి మంత్రినయ్యానని నాయిని నర్సింహారెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాదు, బుల్లెట్ వాహనం అంటే ఆయనకు ఎంతో ఇష్టమట. బేగంబజార్ జిలేబీ రుచిని కూడా మర్చిపోలేరట. స్వగ్రామం నల్లగొండ జిల్లా నేరుడుగొమ్మ కాగా, వ్యవసాయం కోసం దేవరకొండకు మారినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News