: చెన్నైలో కూలిన బహుళ అంతస్థుల భవనం... కొనసాగుతోన్న సహాయక చర్యలు
చెన్నైలోని పోరూరుకు సమీపంలో ముగలివక్కం ప్రాంతంలో 12 అంతస్థుల ట్రస్టు కుప్పకూలిన విషయం విదితమే. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.