: బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్న టి.ప్రభుత్వం
2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అన్ని విభాగాల అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన అంచనాలు పంపాల్సిందిగా కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. అన్ని శాఖలు ఆన్ లైన్లో అంచనాలను పంపాలని సూచించారు.