: భర్తను కట్టేసి మహిళను నగ్నంగా ఊరేగించారు!
స్థానిక గూండాలను వ్యతిరేకించిన ఫలితం ఓ వ్యక్తి దారుణ హింసకు గురయ్యాడు, అతని భార్య అందరి ముందు వివస్త్రగా నడవాల్సి వచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. జెహానాబాద్ ప్రాంతంలోని ఆంద్రియా గ్రామంలో సదరు బాధితులు నివసిస్తున్నారు. వారి పొలంలోని చెట్లను తొలగించవద్దన్నందుకు ఆగ్రహించిన స్థానికుడు శాంతిస్వరూప్ వారిద్దరిపైనా కఠినచర్యలకు ఉపక్రమించాడు. శాంతిస్వరూప్ మనుషులు ఆమె భర్తను కట్టేసి, తీవ్రంగా కొట్టారు. అంతేగాకుండా, ఆమెను వివస్త్రగా చేసి నడిపించారు.
దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు బాధితులతో కలిసి జెహానాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో, జిల్లా ఎస్పీ ఈ వ్యవహారంపై వాకబు చేశారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు ఉపక్రమించారు.