: ఆ యువకుడ్ని కాముక పోలీసులే హత్య చేశారా?...సీబీఐ దర్యాప్తు


ముంబైలో పది మంది కాముక పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. ఓ యువకుడ్ని అపహరించి, లైంగికంగా వేధించి, హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేసు పూర్వాపరాలు... ఆగ్నెలో వాల్డరిస్ (25) అనే యువకుడు ఏప్రిల్ నెలలో వడాలా రైల్వే స్టేషన్ పట్టాలపై శవమై కనిపించాడు. అంతకు ముందు మూడు రోజుల క్రితం అతనిని పోలీసులు చోరీ కేసులో అరెస్టు చేశారు.

లాకప్ లో ఉన్న వాల్డరిస్ తప్పించుకునే ప్రయత్నంలో రైలు కింద పడి మరణించాడని పోలీసులు అప్పట్లో ప్రకటించారు. పోలీసుల ప్రకటనతో వాల్డరిస్ తండ్రి విభేదించి కోర్టులో కేసు వేశారు. దీంతో బాంబే హైకోర్టు వాల్డరిస్ తండ్రి, అతనితోపాటు అరెస్టయిన మరో ముగ్గురి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

వాంగ్మూలంలో వడాలా పోలీసులు వాల్డరిస్ ను దుస్తులు విప్పించి, చివరి వరకు లైంగికంగా వేధించి, గంటలకొద్దీ చితకబాది, వారితో శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేశారని చెప్పారు. దీంతో బాంబే హైకోర్టు కేసును సుప్రీంకోర్టుకు బదలాయించింది. మహారాష్ట్రలో కస్టడీలో మరణించిన వారి విషయంలో న్యాయం జరిగిన దాఖలాలు తక్కువ కావడంతో కేసును సీబీఐకి అప్పగించింది.

  • Loading...

More Telugu News