: ఇద్దరు బాలికలపై మొసలి దాడి
ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు బాలికలపై ఓ మొసలి దాడి చేసింది. బహ్రాయిచ్ సమీపంలోని కతర్నియాఘాట్ వన్యప్రాణి అభయారణ్యంలో ఓ నది నుంచి తాగు నీటిని తెచ్చుకునేందుకు వెళ్లగా మొసలి దాడి చేసిందని ఫారెస్ట్ రేంజర్ ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు. ఫూల్కాలి, పింకిపై దాడి చేయగా... గ్రామస్థులు ఫూల్కాలిని రక్షించగలిగారని, పింకిని మొసలి నదిలోకి లాక్కెళ్లిందని వివరించారు. పింకిని కాపాడడం కోసం అటవీ సిబ్బంది బోట్లతో అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆచూకీ లభించలేదని చెప్పారు. ఫూల్కాలికి గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు.