: నవాజ్ షరీఫ్ జట్టుతో ఇమ్రాన్ జట్టు ఢీ... అఫ్రిది ఛారిటీ మ్యాచ్
పాకిస్థాన్ విధ్వంసక ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. పాక్ వాయవ్య ప్రాంతంలో సైనిక చర్య కారణంగా నిరాశ్రయులైన ప్రజల సహాయార్థం ఈ మ్యాచ్ ఏర్పాటు చేశాడు. సైన్యం వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలోని తాలిబాన్ స్థావరాలపై దాడులకు దిగడంతో 4,70,000 మంది ప్రజలు స్వస్థలాలను వదలి తరలివెళ్ళారు. వారిని ఆదుకునేందుకు అఫ్రిది ముందుకొచ్చాడు. అఫ్రిది కూడా ఇదే ప్రాంతంలో జన్మించాడు. కాగా, ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తే నిధులు వస్తాయని, ప్రధాని నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ లతో మ్యాచ్ అంటే ఇంకాస్త ఎక్కువగానే నిధులు పోగవుతాయని ఈ పఠాన్ భావిస్తున్నాడు. ఈ మేరకు లాహోర్ లో మ్యాచ్ నిర్వహణకు అధికార వర్గాలతో మాట్లాడుతున్నట్టు తెలిపాడు.