: జులై రెండో వారంలో టీ-జేఏసీ ఢిల్లీ పర్యటన


పోలవరం ఆర్డినెన్సును ఉపసంహరింపజేసేందుకు తెలంగాణ జాయింట్ యాక్షన్ స్టీరింగ్ కమిటీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు కార్యచరణ రూపొందించింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్సును విరమింపజేయించాలని కోరేందుకు జులై రెండో వారంలో టీజేఏసీ ఢిల్లీ వెళ్లనుంది. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టూర్ లో ప్రధానమంత్రిని కలసి ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని, వ్యతిరేకించాలని కోరతామని కమిటీ కన్వీనర్ కోదండరాం తెలిపారు. పోలవరం నిర్మాణం అంటే ఆదివాసీలపై దాడేనన్న ఆయన... ఆదివాసీ ఎంపీలతో కలసి ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఇక జులై మూడో వారంలో హైదరాబాదులో ధర్నా నిర్వహిస్తామన్నారు.

  • Loading...

More Telugu News