: నెల రోజుల్లో తెలంగాణ బోర్డులు పెట్టుకోండి... లేకపోతే ఫైన్


తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బోర్డుల తొలగింపుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ పేరు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రైవేటు సంస్థలు కూడా తమ బోర్డుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణను మార్చుకోవడానికి 30 రోజుల గడువు విధించారు. గడువు దాటిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరు అలాగే కనిపిస్తే... లేబర్ డిపార్ట్ మెంట్ జరిమానా విధిస్తుంది. ఇటీవల సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో... హైదరాబాద్ నగరంలోని బోర్డులపై ఇంకా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News