: గుజరాత్ అలాంగ్ షిప్ బ్రేకింగ్ యార్డులో పేలుడు... ఐదుగురు మృతి
గుజరాత్ భావ్ నగర్ లోని అలాంగ్ షిప్ బ్రేకింగ్ యార్డులో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీకైన తర్వాత పేలుడు జరిగిందని, ఆ తర్వాత మంటలు వ్యాపించాయని అక్కడున్న వారు చెబుతున్నారు.