: రోడ్డుప్రమాదంలో సహకార బ్యాంక్ డైరెక్టర్ మృతి
పంజాబ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ సహకార బ్యాంక్ డైరెక్టర్ వెంకటరాజు మరణించారు. మరో ఐదుగురు డైరెక్టర్లు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ డైరెక్టర్ భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. జాతీయ సహకార బ్యాంక్ శిక్షణ కార్యక్రమాలకు హాజరై, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.