: భోజనం చేస్తూ పళ్లను మింగేసింది


ఓ మహిళ భోజనం చేస్తూ అనుకోకుండా పెట్టుడు పళ్ల సెట్ ను మింగేసింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి (45) రాత్రి భోజనం చేస్తుండగా ఆమె నోటిలో బిగించిన పళ్ల సెట్ ను మింగేసింది. అది గొంతుకు అడ్డుపడింది. దీంతో బంధువులు ఆమెను హుటాహుటిన గాంధీ చౌక్ లోని నెరవాటి హాస్పిటల్ లో చేర్చారు. వైద్యులు ఎండోస్కోపీ ద్వారా 30 నిమిషాల పాటు కష్టపడి... కోత, కుట్టు లేకుండా పళ్లసెట్ ను బయటకు తీశారు. పళ్ల సెట్ మింగడం ద్వారా రోగికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందని, పేగులకు పళ్లసెట్ తీగ తగిలి రంధ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News