: చైనీయులు మరోసారి చొరబడ్డారు!


చైనా సైనికులు మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. ఈ వారం మొదట్లో జమ్మూకాశ్మీర్లోని లడక్ సరిహద్దుల్లో ఉన్న పాన్ గాంగ్ సరస్సులో భారత్ వైపుగా ఐదు హైస్పీడ్ బోట్లు వచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా భారత భూభాగంలో ఆరు కిలోమీటర్ల మేర వారు ముందుకు వచ్చినట్లు గుర్తించారు. రెండు గంటల తర్వాత భారత సైనికులు ప్రతిఘటించేసరికి మెల్లగా జారుకున్నారు. ఈ సరస్సులో ఎక్కువ భాగం చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో ఉంటుంది. ఇది రెండు దేశాలకు సమస్యాత్మక ప్రాంతంగా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News