: యూపీఏ-3లా మోడీ సర్కారు: ఆమ్ ఆద్మీ
మోడీ సర్కారు నెల రోజుల పాలనపై ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ పాలన యూపీఏ-3 సర్కారుగా మారేలా ఉందని అభివర్ణించింది. ధరల కట్టడి, అవినీతి నిర్మూలన వంటి హామీలను కొత్త సర్కారు మరిచిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు నిదర్శనాలుగా రైల్వే చార్జీల పెంపు, పంచదార దిగుమతి సుంకం పెంపు నిర్ణయాలను గుర్తు చేసింది. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలోనూ హమీలను తుంగలో తొక్కిందని విమర్శించింది.