: రూ.15 వందల కోట్లతో రైల్వే డబ్లింగ్ పనులు ప్రారంభం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద రూ.1500 కోట్లతో రైల్వే డబ్లింగ్ విద్యుదీకరణ పనులను రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడ, గుడివాడ, భీమవరం, మచిలీపట్నం, నిడదవోలు వరకు 223 కిలోమీటర్ల మేర ఈ విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. 2013-14 రైల్వే బడ్జెట్ లో ఈ డబ్లింగ్ ప్రాజెక్టును రైల్వేశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.