: నిరుద్యోగులతో నిండిపోయిన పాట్నా ఎక్స్ ప్రెస్
పాట్నానుంచి సికింద్రాబాదుకు వచ్చే ఎక్స్ ప్రెస్ నిరుద్యోగులతో నిండిపోయింది. రైల్వే ఉద్యోగ పరీక్ష కోసం పెద్ద ఎత్తున అభ్యర్థులు పాట్నాకు చేరుకున్నారు. వారణాసి నుంచి వచ్చిన తెలుగు భక్తులు సికింద్రాబాదుకు వచ్చేందుకు రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. తమ గోడును స్టేషన్ మాస్టర్ కు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు విచారం వ్యక్తం చేశారు. దీంతో, పాట్నా రైల్వేస్టేషన్ లో 400 మందికి పైగా భక్తులు నిరీక్షిస్తున్నారు.