: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల


ఇంటర్మీడియెట్ సెకండియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ సాయంత్రం ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో 43.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దాంతో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వార్షిక, సప్లిమెంటరీ పరీక్షల మొత్తం ఉత్తీర్ణత 77.87 శాతానికి చేరుకుంది. జులై 3వ తేదీ నుంచి ఆయా కళాశాలల్లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News