: చాంపియన్స్ తయారు కారు...పుడతారు!


సాధన వల్ల ఛాంపియన్స్ తయారు కారని... చాంపియన్స్ జన్మతః పుడతారని 1936 ఒలింపియన్ హెలెన్ స్టీఫెన్స్ పేర్కొన్నారు. తాజా పరుగుల సంచలనం ఉసేన్ బోల్ట్ కూడా పుట్టుకతోనే ఛాంపియన్ అని ఆయన తెలిపారు. అయితే సాధనతో పరుగును, టెక్నిక్ ను మెరుగుపరుచుకుని ఛాంపియన్ అయ్యాడని అన్నారు. దీనిపై పరిశోధనలు చేసిన పరిశోధకుడు కూడా ఇదే విషయాన్ని నిర్థారించాడు. అమెరికాలోని గ్రాండ్ వేలీ స్టేట్ యూనివర్సిటీకి చెందిన మైఖేల్ లాంబార్డో పదేళ్లు ఈ విషయంపై పరిశోధనలు సాగించారు.

26 మంది ప్రపంచ ప్రఖ్యాత పరుగుల వీరులు, 15 మంది ఒలింపిక్ విజేతలపై ఈ స్టడీ నిర్వహించారు. వారంతా ఊహకందని వేగంతో ఉన్న వారని, వారు ప్రాక్టీస్ కారణంగా రాణించలేదని, సాధారణంగా ఉన్న వేగానికి సాధనతో కాస్త టెక్నిక్ కలుపుకుని ప్రపంచ ప్రసిద్ధిగాంచారని ఆయన అభిప్రాయపడ్డారు. మట్టిలో మాణిక్యాలుగా పేరుగాంచిన పరుగు వీరులంతా కేవలం మూడేళ్లు, నాలుగేళ్ల సాధనతో లక్ష్యాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశోధనతో శాస్త్రవేత్తలు ఏకీభవిస్తారో లేదో చూడాలి.

  • Loading...

More Telugu News