: పాకిస్థాన్ లో ఉన్నామా?... నేత మారిన ప్రతిసారి ఇదే సమస్య: అయ్యప్ప సొసైటీ వాసులు
తాము పాకిస్థాన్ లో ఉన్నామో, హైదరాబాదులో ఉన్నామో అర్థం కావడం లేదని అయ్యప్ప సొసైటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల కూల్చివేత సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారి తమను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యప్ప సొసైటీ భూముల్లో తోడేళ్లు తిరుగాడేటప్పుడే తాము ఇళ్లు కట్టుకుని నివాసం ఉన్నామని అన్నారు.
అధికారం మారిన ప్రతిసారి భూముల క్రమబద్దీకరణ, ఆక్రమణ పేరుతో తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వేధించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా తమ భూములు క్రమబద్దీకరించారని వారు తెలిపారు. ఇప్పుడు అధికారులు, పోలీసులు వేధించడం సరికాదని హితవు పలికారు.