: గౌహతిలో వరదలు, విరిగిపడిన కొండచరియలు... ఏడుగురు మృతి
అసోం రాజధాని గౌహతితో పాటు నాలుగు జిల్లాల్లో గత 12 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడి ముగ్గురు, విద్యుత్ షాక్ తో నలుగురు చనిపోయారు. గౌహతి నగరంలోని పలు ప్రాంతాల్లో వరదనీరు పొంగి పొరలుతోంది. బ్రహ్మపుత్ర నదిలో నీటిప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. అసోం సీఎం తరుణ్ గొగోయ్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.