: రొమాన్సుకు వయసుతో పనేంటి?: విద్యాబాలన్
రొమాన్స్ పండించేందుకు వయసుతో పని లేదని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అభిప్రాయపడింది. 'బాబీ జాసూస్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో ఆమె మాట్లాడుతూ, సినిమాల్లో కథకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు వయసు వ్యత్యాసం పెద్దగా లెక్కలోకి రాదని చెప్పింది. 'డర్టీ పిక్చర్' లో సీనియర్ స్టార్ నజీరుద్దీన్ షాతో రొమాన్స్ పండించిన విద్య, 'బాబీ జాసూస్' లో యువనటుడు అలీ ఫైజల్ తో జతకట్టింది.