: ఇండో, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య భారీ ఒప్పందం
గత కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న భారత, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తాజగా ఓ భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఆరు ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఆడాల్సి ఉంటుంది. ఫ్యూచర్స్ టూర్ ప్రోగ్రామ్ ను అనుసరించి వచ్చే ఎనిమిదేళ్ళలో ఈ సిరీస్ లు జరుగుతాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కరాచీలో ప్రకటన చేసింది. మెల్బోర్న్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో పాల్గొనడం ద్వారా భారీగా లబ్దిపొందామని, భారత్ తో లాభసాటి ఒప్పందం కుదుర్చుకున్నామని పీసీబీ వర్గాలు తెలిపాయి.
అయితే, పాక్ తో సిరీస్ లు తటస్థ వేదికలపై నిర్వహించే అవకాశాలున్నాయి. ఉగ్రవాదం కారణంగా క్రికెట్ జట్లేవీ కూడా పాకిస్థాన్ కు వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపథ్యంలో గతకొంతకాలంగా పాక్ జట్టు యూఏఈ వేదికగా క్రికెట్ సిరీస్ లలో పాల్గొంటోంది.