: ఎయిర్ టెల్ 3జి రోమింగ్ పై సుప్రీంకోర్టు నిషేధం


అనుమతి లేని సర్కిళ్లలో కొత్త కస్టమర్లకు 3జి రోమింగ్ సేవలు అందించకుండా సుప్రీం కోర్టు భారతీ ఎయిర్ టెల్ పై నిషేధం విధించింది. ఈ కేసులో తుది ఆదేశాలు వెలువడే వరకూ ఇది అమలులో ఉంటుందని కోర్టు ఈ రోజు పేర్కొంది. ఇప్పటికే 3జి రోమింగ్ అందుకుంటున్న వారికి సేవలు కొనసాగించేందుకు కోర్టు ఎయిర్ టెల్ కు అనుమతినిచ్చింది.

కొన్ని సర్కిళ్లలో స్పెక్ట్రం లేకపోయినా ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ ఒక ఒప్పందానికి వచ్చి.. తమకు అనుమతి లేని సర్కిళ్లలో మరొకరి స్పెక్ట్రం వినియోగించుకుంటున్నాయి. దీంతో వీరి కూటమిపై టెలికాం శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అనుమతి లేని చోట సేవలు నిలిపివేయాలంటూ మార్చి 15న ఎయిర్ టెల్ ను ఆదేశించింది. 350 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. దీంతో ఎయిర్ టెల్ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. ఐడియా, వొడాఫోన్ లు కూడా 3జి రోమింగ్ సేవలను నిలిపి వేయాలని ఆదేశిస్తూ వాటిపై కూడా జరిమానా విధిస్తూ టెలికాం శాఖ కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News