: ముంబయిలో 'సీ ప్లేన్' సేవలు


సీ ప్లేన్లు..! నీటిపైనా ల్యాండయ్యే ఈ చిన్న విమానాలను ఇకపై ముంబయిలోనూ తరచుగా చూడొచ్చు. జుహూ ప్రాంతం నుంచి గిర్గామ్ చౌపట్టీ వరకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. వీటిలో ప్రయాణించేందుకు టికెట్ ధర రూ.850గా నిర్ణయించారు. కాగా, ఈ సీ ప్లేన్లలో మూడు నుంచి ఏడు సీట్ల వరకు ఉంటాయి. దీపావళి నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు నౌకా, రక్షణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు లభించాయి. గత ఫిబ్రవరిలో ముంబయి నుంచి లోనవాలా ఆంబీ వ్యాలీకి సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించారు. ఈ విమానాలు 100 కిలోమీటర్ల ప్రయాణానికి 25 నిమిషాలు తీసుకుంటాయి. అదే రోడ్డు మార్గంలో అయితే ముంబయి నుంచి లోనావాలాకు గంటపైనే పడుతుంది.

  • Loading...

More Telugu News