: దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సోనియాగాంధీ
తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైను పేలుడులో 15 మంది మృతి చెందడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.