: యాపిల్ కలర్ ఫుల్ ఐపాడ్
యాపిల్ కంపెనీ నూతన ఐపాడ్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఈ ఐపాడ్ ధర రూ. 16,900. పింక్, ఎల్లో, బ్లూ తదితర రంగుల్లో ఇది లభ్యం కానుంది. దీనిలో 5 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, హెచ్ డీ వీడియో రికార్డింగ్, 4 అంగుళాల రెటీనా డిస్ ప్లే, ఏ5 చిప్, ఫేస్ టైమ్ కెమెరా సదుపాయాలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. 32 జీబీ ఐపాడ్ ధర రూ. 20,900 కాగా, 64 జీబీ సామర్థ్యం ఉన్న ఐపాడ్ ధర రూ. 24,900. వీటిల్లో 200కు పైనే ఫీచర్లు ఉన్నాయి.