: 'అమ్మ' పేరుతో మరొకటి!
తమిళనాడులో సర్వం 'అమ్మ' మయం అయ్యే రోజులు మరెంతో దూరంలో లేవనిపిస్తోంది! అభిమానులకు, ఏఐఏడీఎంకే పార్టీ నేతలకు అమ్మలా భాసిల్లే ముఖ్యమంత్రి జయలలిత పేరిట అక్కడ ఎన్ని పథకాలో! అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, తాజాగా అమ్మ ఫార్మసీలు..! ఈ పర్వం ఇక్కడితో ఆగేట్టు కనిపించడంలేదు. తాజాగా, 'అమ్మ' సినిమా థియేటర్లు ఏర్పాటు చేయనున్నారట. రాయితీ ధరలకు టికెట్లు విక్రయించడం ఈ థియేటర్ల ప్రత్యేకత. జయలలితకు వీరాభిమాని అయిన చెన్నై మేయర్ ఈ అమ్మ పథకాలకు ఆద్యుడని తెలుస్తోంది. వీటి అమలు బాధ్యతను ఆయన తన భుజాలకెత్తుకున్నారు. ఏదేమైనా తమిళ ప్రజలు ఈ విషయంలో అదృష్టవంతులే.