: ఆగిన గూడ్స్ రైలు... నిలిచిన నవజీవన్ ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
ఖమ్మం జిల్లా చింతకాని వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ గూడ్స్ రైలు ఆగిపోయింది. గూడ్స్ రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే పలురైళ్లకు అంతరాయం కలిగింది. దీంతో చింతకానిలో నవజీవన్ ఎక్స్ ప్రెస్, పందిళ్లపల్లిలో గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు గూడ్స్ రైలుకు మరమ్మత్తు పనులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.