: ట్రాఫిక్ పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేస్తున్నారు!
హైదరాబాదులో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు త్వరలో వీక్లీ ఆఫ్ ఇవ్వనున్నట్లు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే, దీనికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. పోలీసు స్టేషన్ లలో మెరుగైన పనితీరు కనబర్చిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీ చెప్పారు. మాదకద్రవ్యాల సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తామని, నార్కోటిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు.