: 1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్న వారికే ఫీజు రీఎంబర్స్ మెంట్
ఫీజు రీఎంబర్స్ మెంట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమీక్షంచారు. ఈ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి దివంగత ఆచార్య జయశంకర్ పేరు పెట్టనున్నట్టు సమాచారం. అలాగే తండ్రి స్థానికత ఆధారంగా, 1956కు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ఫీజు రీఎంబర్స్ మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలతో అధికారులు జీవో విడుదల చేయనున్నారు. విద్యార్థి స్థానికత ఆధారంగా బోధన రుసుం చెల్లించే అంశానికి ముగింపు పలకనున్నారు.