: బందరు పోర్టు నిర్మాణంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు: కొల్లు రవీంద్ర
ప్రస్తుతం రాష్ట్రంలో 7 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద లబ్ధి పొందుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కల్పించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కావాల్సిన అనుమతుల కోసం రాజధానిలోని వివిధ శాఖల అధికారులతో చర్చించామని మంత్రి కొల్లు అన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని, పోర్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయనీ అన్నారు. స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించి, మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు.