: లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడు... ప్రాణాలు పోగొట్టుకున్నాడు


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లిఫ్ట్ లో చిక్కుకున్న 14 సంవ్సరాల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. కాకినాడ పోరంగిపేటకు చెందిన రమేష్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో రెండు నెలలుగా అపోలో ఆస్పత్రి క్యాంటీన్ లో పనిచేస్తున్నాడు. ఇవాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుని మరణించాడు. బాలుడి మృతికి ఆసుపత్రి, క్యాంటీన్ యజమాని నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News