: పోస్టల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు అవార్డులు
మిగిలిన కంపెనీలకు దీటుగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ)ను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేసిన అధికారులకు అవార్డులు ఇస్తున్నట్లు పీఎల్ఐ బోర్డు సభ్యురాలు అంజలీ దేవేశ్వర్ తెలిపారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల తపాలా ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. రూ. 49 వేల కోట్ల పోస్టల్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన డిపాజిట్లను భారత ప్రభుత్వంలో బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడి పెట్టినట్లు అంజలి వెల్లడించారు. వీటి ద్వారా ఏటా 9.3 శాతం రిటర్న్స్ వస్తున్నట్లు ఆమె చెప్పారు.