: మాజీ సీఎం కిరణ్ ను కలసిన కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. మామూలుగానే తాను కిరణ్ ను కలసినట్టు అనంతరం కిషన్ మీడియాతో అన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని తెలిపారు. కాగా, కిరణ్ బీజేపీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.