: ప్రవాస భారతీయులను కోరతా: పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సమాచార ప్రసార శాఖ, ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికాలో వారం రోజులపాటు పర్యటిస్తానని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారం కావాలని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు ఆర్థిక వనరులు సమీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.