: విద్య, విద్యుత్ శాఖలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష


తెలంగాణలో విద్య, విద్యుత్ శాఖలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కేజీ నుంచి పీజీ విద్య, నిరంతరాయ విద్యుత్ హామీలను అమలు చేసేందుకు పట్టే కాలం, అయ్యే ఖర్చులపై వివరాలు ఆరా తీసినట్టు సమాచారం. కాగా, ఫీజు రీయింబర్స్ మెంటు, మేనేజ్ మెంట్ ఫీజుల సరళీకరణ వంటి అంశాలపై చర్చించారు. గతేడాది ఉన్న మెడికల్ ఫీజులే ఈ ఏడాది కూడా కొనసాగించాలని, నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తే కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News