: బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యం
ఉత్తరప్రదేశ్ లోని బియాస్ నది ఘటనలో హైదరాబాదుకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు 18 మృతదేహాలను వెలికితీశారు. ఈరోజు మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ విద్యార్థిని జగదీష్ ముదిరాజ్ గా గుర్తించారు. దీంతో, ఇప్పటి వరకు లభించిన విద్యార్థుల మృతదేహాల సంఖ్య 19కి చేరుకుంది.